
అన్ని రంగాల్లో నియోజకవర్గ అభివృద్ధి
రామకృష్ణాపూర్: చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆయా వార్డుల్లో నెలకొ న్న సమస్యలు తెలుసుకుని రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ అమృత్ స్కీం ద్వా రా నియోజకవర్గంలో రూ.100 కోట్లతో మంచినీటి ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నామని, వచ్చే జనవరి నాటికి పూర్తవుతాయని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్, మున్సిపల్ కమిషనర్ రాజు, పార్టీ నాయకులు పల్లెరాజు, రఘునాథ్‌రెడ్డి, వొడ్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటా
చెన్నూర్/చెన్నూర్‌రూరల్: కార్యకర్తలకు అండగా ఉంటానని మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోటపల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యకర్తలు గ్రామాల్లోని సమస్యలు, అభివృద్ధి పనులపై మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం మంత్రి పట్టణంలోని పలు వీధుల్లో మార్నింగ్ వాక్ చేశారు. 2.0 వాటర్ ట్యాంక్‌లు, అంబేడ్కర్ భవన నిర్మాణాలు పరిశీలించారు. మండలంలోని కిష్టంపేట గ్రామంలో బోరును ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.