
‘ఆదర్శ’ విద్యార్థికి రాష్ట్ర స్థాయిలో స్వర్ణం
కాసిపేట: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి జక్కు ల అశ్విన్ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి స్వర్ణ పతకం సాధించినట్లు ప్రిన్సిపాల్ అబ్ధుల్ ఖలీల్ మంగళవారం తెలిపారు. జనగామ జిల్లా కూనూర్‌లో నిర్వహించిన అండర్–14 విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరఫున పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థి, పీఈటీ శ్రీనివాస్‌ను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
మోడల్ స్కూల్‌కు చెందిన ఇంటర్ ఫస్టియర్ బీ సాయినాథ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ఖలీల్ తెలిపారు. ఈనెల 15న పా ఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో బె ల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో నిర్వహించిన అండర్–19 విభాగంలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థా యికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. వీరిని ప్రిన్సిపాల్, పీఈటీ, ఉపాధ్యాయులు అభినందించారు.