
108లో ప్రసవం
ఇంద్రవెల్లి: ఓ నిండు గర్భిని 108 అంబులెన్స్‌లో ప్రసవించింది. ఈ ఘటన సోమవారం రాత్రి మండలంలోని ముత్నూర్ సమీపంలో జరిగింది. నార్నూర్ 108 అంబులెన్స్ ఈఎంటీ ప్రదీప్‌కుమార్, పైలెట్ రమాకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్ (యూ) మండలంలోని పుల్లార గ్రామానికి చెందిన పర్చకి మారుబాయికి సోమవారం రాత్రి పురుటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆమెను ఉట్నూర్ సీహెచ్‌సీకి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు రిమ్స్‌కు రెఫర్ చేశారు. 108 అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రి మ్స్‌కు ఆమెను తరలిస్తుండగా ముత్నూర్ సమీపంలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్స్‌ను రోడ్డు పక్కనే ఆపి ఈఎంటీ ప్రదీప్ పురుడుపోశారు. మారుబాయి మూడో కాన్పులో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. వారిని రిమ్స్‌కు తరలించారు. 108 సిబ్బందిని పలువురు అభినందించారు.