
బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య
మందమర్రిరూరల్: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తితో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మందమర్రిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజశేఖర్, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపక్‌నగర్‌కు చెందిన పిట్టల లక్ష్మి (65) కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతోంది. మంగళవారం తెల్లవారుజామున సుమారు 3గంటలకు మృతురాలి భర్తకు మెలకువ రావడంతో లక్ష్మి మంచం వద్దకు వెళ్లి చూడగా ఆమె కనిపించలేదు. సమీపంలో వెతకగా బావిలో మృతదేహం కనిపించింది. ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వడ్డీ వ్యాపారి వేధింపులకు ఒకరు ఆత్మహత్య
ఇంద్రవెల్లి: వడ్డీ వ్యాపారి వేధింపులకు ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలకేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. బుద్ధనగర్‌కు చెందిన దహికాంబ్లే రాము (40) మండల కేంద్రంలో బైక్ మెకానిక్‌గా పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 10న సాయంత్రం పని ముగించుకున్న తర్వాత పురుగుల మందు తాగి ఇంటికి వెళ్లాడు. ఇంటి వద్ద వాంతులు చేసుకుంటుండగా అతడి భార్య సంఘమిత్ర గమనించింది. ఏమైందని అడిగితే తాను వ్యాపారం నిమిత్తం జవహర్‌లాల్ అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ.20 వేలు అప్పు తీసుకున్నానని తెలిపాడు. ప్రతీ వారం రూ.1,500 చొప్పున చెల్లిస్తున్నానని, ఆర్థిక ఇబ్బందులతో మూడు వారాలుగా చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారి ఇష్టారీతిన తిట్టడంతో అవమానంతో పురుగులు మందు తాగినట్లు చెప్పాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృత్యుడికి భార్యతోపాటు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడున్నారు. కాగా, ఘటనపై మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినా వడ్డీ వ్యాపారిపై కేసు నమోదు కాలేదు. దీంతో ఎస్పీ అఖిల్ మహాజన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎస్సై సాయన్నకు సంప్రదించగా.. ఈ నెల 10న ఫిర్యాదు అందినమాట వాస్తవమేనని, మంగళవారం ఉదయమే కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఆర్టీసీ కార్మికులపై పనిభారం తగ్గించాలి
ఆదిలాబాద్: ఆర్టీసీ కార్మికులపై పనిభారం త గ్గించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజి యన్ అధ్యక్షుడు సర్పే భీమ్‌రావు కోరారు. ఆది లాబాద్ డిపో ఎదుట మంగళవారం ఫెడరేషన్ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కిలోమీటర్ల పెంపు, ఓటీలు తగ్గించడం, రన్నింగ్ టైం కుదించడంతో కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని తెలిపారు. వీటన్నింటినీ ఎ దుర్కోవాలంటే ఫెడరేషన్‌ను మరింత బలోపే తం చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నా రు. కార్మికుల హక్కుల సాధనకు పోరాడటాని కి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో ఫెడరేషన్ కార్యదర్శి మిట్టపల్లి భీంరావు, డిపో కార్యదర్శి ఆశన్న, వెంకటేశ్, రవి, సాయన్న, రాజేందర్, ప్రకాశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య