
గురువుకు రిటైర్డు జడ్జి పాదాభివందనం
జన్నారం: తన ఉన్నత స్థానానికి కారణమైన గురువును మరవకుండా ఇంటికి వెళ్లి శాలువా కప్పి పాదాభివందనం చేసి రిటైర్డు జడ్జి కనికరం రాజన్న గురుభక్తిని చాటుకున్నారు. మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన రిటైర్డు జడ్జి రాజన్న 1960 నుంచి 1970వరకు జన్నారంలో పదో తరగతి వరకు చదివారు. అప్పటి సోషల్ టీచర్ కిష్టాపూర్ గ్రామానికి చెందిన నోముల రాజమౌళి ఆయనకు విద్యాబోధన చేశారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాజన్న ఆయన ఇంటికి వెళ్లి సన్మానించి పాదాభివందనం చేశారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువును సన్మానించడం తన బాధ్యత అని తెలిపారు.
రిటైర్డ్ ఉపాధ్యాయులకు సన్మానం
మండలంలోని పొనకల్ శ్రీలంక కాలనీలో శు క్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కాలనీ వాసులు రిటైర్డ్ ఉపాధ్యాయులు భూమన్న, భీంలాల్, తదితరులను శాలువా లు, పూలమాలలతో సన్మానించారు. ఇరిగేషన్ వర్క్ ఇన్‌స్పెక్టర్ శంకర్ పాల్గొన్నారు.