
సమస్యలపై ఎంపీకి వినతి
జన్నారం: మండలంలోని వివిధ సమస్యలు పరిష్కరించాలని, అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్‌ను బీజేపీ మండల నాయకులు కోరారు. శుక్రవారం ఆదిలాబాద్‌లో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. రోటిగూడ వెళ్లే దారిలో ఒర్రైపె హైలెవెల్ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, మహమ్మదాబాద్ నుంచి రోటిగూడ ఊరు చివరి వరకు 4 కి.మీ బీటీ రోడ్డు, చింతగూడ లక్ష్మీదేవి టెంపుల్ రోడ్డు, బాలుర ఉన్నత పాఠశాల నుంచి నల్ల పోచమ్మ వరకు రోడ్డు నిర్మించాలని కోరారు. మండల కేంద్రంలో పీహెచ్‌సీని 30 పడకల ఆసుపత్రిగా ఆప్‌గ్రేడ్ చేయడం, పోనకల్‌లో రోడ్డు వెడల్పు సెంట్రల్ లైటింగ్ సిస్టం, ఇరువైపులా డ్రెయినేజీల నిర్మాణం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు తదితర సమస్యలపై విన్నవించినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రావు తెలిపారు. ఎంపీ స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. జిల్లా కౌన్సిల్ సభ్యుడు కొంతం శంకరయ్య, బీజేపీ నాయకులు మేడ నరహరి, సేపూరి గోపాల్, ఉప్పు రాజన్న, నీరటి శ్రీనివాస్, శివనూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.