
వ్యాపారులు జాగ్రత్త వహించాలి
నకిలీ కరెన్సీ చెలామ ణి చేసేవారు రూ. 500, రూ.200నోటుతో కేవలం రూ.50 విలువైన వస్తువులు కొనుగోలు చేసి వెంటనే వెళ్లిపోతారు. ఇలాంటి సమయంలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. రద్దీ ఉన్న దుకాణాల్లోనే కొనుగోలు చేస్తుంటారు. వినియోగదారుడు డబ్బు చెల్లించాక వ్యాపారి తిరిగి చెల్లించే డబ్బుల విషయంలో తొందరపడతాడు. ఇలాంటి వారిపై ఓ కన్నేసి ఉంచాలి. వ్యాపారులు క్యాష్ కౌంటర్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఏమైనా అనుమానం వస్తే వెంటనే 100 డయల్‌కు సమాచారం అందించాలి.
– డీసీపీ ఎగ్గడి భాస్కర్, మంచిర్యాల