
‘రక్షా బంధన’మై..!
రాఖీ కట్టి ఒక్క రూపాయే తీసుకుంటారు
బెల్లంపల్లి: నా చదువంతా హాస్టళ్లలో కొనసాగింది. పండుగలకు ఇంటికి దూరంగా ఉండేవాడిని. అక్కాచెల్లెళ్ల ఆత్మీయత, అనురాగాలకు ప్రతీకగా నిలుస్తున్న రాఖీ పండుగకు కూడా తోబుట్టువులకు అందుబాటులో ఉండేవాడిని కాదు. కానీ ఆ పండుగ నాకెంతో ప్రత్యేకమైంది. నేనెంత దూరం వెళ్లి చదువుకుంటున్నా సరే మా అక్క లక్ష్మిమౌనిక, మా బాబాయి, పిన్నిల కూతుళ్లు ఇద్దరు కలిసి వచ్చి చేతికి రాఖీ కట్టి నిండు మనస్సుతో ఆశీర్వదించడం క్రమం తప్పక వస్తున్న ఆనవాయితీ. ఈ తీపి జ్ఞాపకాలు ఎన్నడూ మర్చిపోలేను. రాఖీ కట్టినందుకు మా అక్కాచెల్లెళ్లు నా నుంచి కట్నకానుకలు ఏమీ ఆశించేవారు కాదు. డబ్బు ఇవ్వడానికి సిద్ధపడితే ససేమిరా ఒప్పుకునే వారు కాదు. నా తృప్తి కోసం ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒక్కొక్కరు ఒక్కో రూపాయి చొప్పున తీసుకుని సంతోషపడేవారు. నేటికీ అదే కొనసాగుతోంది. నా జీవితంలో రాఖీ పండుగకు ఎంతో అనుబంధం ఉంది. 2023లో నాగ్‌పూర్‌లో ఇన్‌కంట్యాక్స్ అధి కారిగా శిక్షణ పొందుతున్న సమయంలో పండుగ వచ్చింది. మా ముగ్గురు అక్కాచెల్లెళ్లు నాగ్‌పూర్‌కు వచ్చి నా చేతికి రాఖీ కట్టి దీవించారు. ఆ వేళ యాధృచ్చికంగా యూపీఎస్‌సీ ఫలితాలు వెల్లడై ఐఏఎస్‌గా సెలక్ట్ అయ్యాను. ఆ తీపి గుర్తు నేనెన్నడు మర్చిపోలేను. – బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ఐఈఎస్‌ఎస్‌డీ మనోజ్

‘రక్షా బంధన’మై..!

‘రక్షా బంధన’మై..!