
మారని బతుకులు
ఉట్నూర్ మండలం వంకతుమ్మ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళలు ఉట్నూర్‌లో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి ఇలా గ్రామానికి తిరిగిరావడం నిత్యకృత్యం. అలాగే ఈ గ్రామానికి చేరుకోవాలంటే మధ్యలో వాగు దాటాల్సిందే. అత్యవసర పరిస్థితుల్లో వీరిది దయనీయ పరిస్థితి. 2013లో జరిగిన రెండు ఘటనలు ఇప్పటికీ ఆ గ్రామస్తులు మరిచిపోలేరు. ఓ నిండు గర్భిణికి పురుటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో వాగు దాటడం ఆలస్యం కావడంతో ఆమె మృత్యువాత పడింది. అదే ఏడాది పాము కాటుకు గురైన మారుతిని ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో వాగు ఉప్పొంగిన క్రమంలో ఆయన మృతిచెందాడు.