
శివసాగర్ చెరువులో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం సాధన
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్‌కు చెందిన ఎస్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందం శుక్రవారం జిల్లా కేంద్రంలోని శివసాగర్ చెరువులో సాధన చేశారు. కమాండెంట్ వెంకటరాములు ఆధ్వర్యంలో సాధన చేస్తున్న బృందానికి మంచిర్యాల అగ్నిమాపక శాఖ సిబ్బంది సహకారం అందించారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడే అధునాతన పరికరాలను ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా వినియోగించాలనే పలు అంశాలతోపాటు కఠిన సమయాల్లో ఆపదలో ఉన్నవారిని ఏ విధంగా రక్షించాలనే అంశాలపై సాధన చేశా రు. మంచిర్యాల జిల్లా అగ్నిమాపక అధికారి భగవాన్‌రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ నాగేశ్వర్‌రావు, ఆర్‌ఐ అశోక్, ఆర్‌ఎస్సై సురేశ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.