● బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్
బాధ్యతల స్వీకరణ..
మంచిర్యాలఅగ్రికల్చర్: బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన మనోజ్ కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ కుమార్ దీపక్‌ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందజేశారు.
బుగ్గలో ప్రత్యేక పూజలు
బెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లి మండలం క న్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీబుగ్గ రాజేశ్వరస్వామి ఆలయంలో సబ్ కలెక్టర్ మనోజ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, ఆలయ అన్నదాన ట్రస్ట్ చైర్మన్ శ్రీదేవి, కన్నాల మాజీ సర్పంచ్ స్వరూప, సిబ్బంది పాల్గొన్నారు.
బెల్లంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న భూభారతి చట్టాన్ని సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యం ఇ స్తానని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ఇనుకొండ ఈశ్వర సత్యసాయి దుర్గ (ఐఈఎస్‌ఎస్‌డీ) మనోజ్ అన్నా రు. గురువారం సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టా రు. అంతకు ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం, చి న్ననా టి జ్ఞాపకాలు, తదితర అంశాలు పంచుకున్నారు.
కుటుంబ నేపథ్యం
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అనంతారం తండ్రిగారి స్వస్థలం. తల్లిదండ్రులు ఇనుకొండ గంగాభవాని, వెంకటేశ్వర్లు. సోదరి లక్ష్మీ మౌనిక. తండ్రి పోలీసు శాఖలో ఏసీబీ సీఐగా పనిచేస్తున్న క్రమంలో రాజమండ్రికి బదిలీ అయిన సమయంలో అక్కడ జన్మించాడు.
విద్యాభ్యాసం
మంచిర్యాల జిల్లా తాండూర్‌లోని విద్యాభారతి పాఠశాలలో 4, 5 తరగతులు, మెట్‌పల్లిలో ఆరోతరగతి, 7 నుంచి 10 వరకు హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. 2013 నుంచి 2015 వరకు గుంటూరులోని భాస్యం విద్యాసంస్థలో ఇంటర్, 2015లో పోటీ పరీక్షకు హాజరై వరంగల్‌లో నీట్‌లో సీటు సాధించాడు. 2019లో కంప్యూటర్ సైన్స్ గ్రూపులో బీటెక్ పూర్తి. 2021లో సివిల్స్ రాయగా ఐఆర్‌ఎస్‌కు ఎంపికకావడంతో ఇన్‌కంట్యాక్స్ అధికారిగా ఉద్యోగం వచ్చింది. నాగ్‌పూర్‌లో ట్రైనింగ్ చేస్తుండగా 2022లో ఐఏఎస్ పాసయ్యా. 2023 ఆగస్టు నుంచి 2024 ఏప్రిల్ వరకు ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ పూర్తి. 2024 నుంచి 2025 మార్చి వరకు సంగారెడ్డిలో ట్రెయినీ కలెక్టర్‌గా విధులు. 2025 ఏప్రిల్, మేలో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో అసిస్టెంట్ సెక్రెటరీగా బాధ్యతలు. జూన్, జూలైలో రెండు నెలల పాటు మరోసారి ముస్సోరిలో శిక్షణ. గత జూలై 25న ఐఏఎస్ శిక్షణ పూర్తికాగానే బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా పోస్టింగ్.
బెల్లంపల్లి ప్రాంతంపై అవగాహన
నాన్న తాండూర్ పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన సమయంలో ఆయనతో కలిసి ఆయా ప్రాంతాలన్నీ తిరిగా. ఆ జ్ఞాపకాలు నేటికీ నాకు చాలా బాగా గుర్తున్నాయి. ఈ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులపై అవగాహన ఉంది.