
అటవీ భూములు ఆక్రమిస్తే పీడీయాక్ట్
● డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావు పాటిల్
ఆదిలాబాద్‌టౌన్: అటవీ భూములను ఆక్రమిస్తే పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తామని జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ అన్నారు. ఇచ్చోడ మండలంలోని కేశవపట్నంలో ముల్తానీలు, కొంతమంది దుండగులు చేసిన దాడిలో గాయపడిన పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. సోమవారం యాపల్‌గూడ 2వ బెటాలియన్ కానిస్టేబుళ్లు రాకేష్, ప్రశాంత్, షేకును రిమ్స్‌లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని పేర్కొన్నారు. అటవీ భూములను ఆక్రమిస్తే ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆయన వెంట ఆదిలాబాద్ ఎఫ్‌ఆర్‌వో గులాబ్‌సింగ్, అటవీ శాఖ సిబ్బంది అమర్, వెంకటేష్, రాథోడ్ గులాబ్, తదితరులు ఉన్నారు.