
తండ్రి మందలించాడని కుమారుడు..
ఇంద్రవెల్లి: తండ్రి మందలించాడని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సాయన్న, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గౌరపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చిత్తబట్టలో చహకటి గంగారాం, భుంబాయి దంపతులకు సోము, శంకర్, గణేశ్ (19), క్రిష్ణ సంతానం. సోము, శంకర్‌కు వివాహాలు కావడంతో ఇతర గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. గణేశ్ ఇంటివద్ద ఉంటూ తల్లిదండ్రులకు పనిలో సహకరిస్తున్నాడు. కొన్నిరోజులుగా ఇంట్లో పనులు మానేసి తిరుగుతుండడంతో ఈ నెల 20న తండ్రి మందలించి వ్యవసాయ పనులకు వెళ్లాడు. క్షణికావేశంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.