
పిల్లల స్థాయికి తగినట్లుగా చదువు
నెన్నెల మండలం కొత్తూరు ఎంపీయూపీఎస్‌లో జీవనకుమారి స్కూల్ అసిస్టెంట్(సోషల్) టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె కుమారుడు జెస్సిల్ ప్రిన్స్‌ను ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారు. తాను విధులు నిర్వర్తించే పాఠశాల దూరం కావడంతో దగ్గరలో ఉన్న నస్పూర్ మండలం తీగలపహాడ్ పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు. ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల స్థాయి కంటే ఎక్కువగా.. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల స్థాయికి తగినట్లుగా చదువులు ఉంటాయని ఆమె గుర్తు చేశారు. నిపుణులైన గురువులు ఉంటారని, తన కుటుంబ సభ్యులందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని పేర్కొన్నారు.