
యురియా కోసం రైతుల ఆందోళన
భీమిని: మండల కేంద్రంలోని ప్రాథమిక వ్య వసాయ సహకార కేంద్రం(పీఏసీఎస్) ఎదు ట సోమవారం యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. భీమిని, కన్నెపల్లి మండలాల రైతులకు ఒకటే పీఏసీఎస్ భీమిని లో ఉండడంతో రైతులు బారులు తీరారు. 444 యురియా బస్తాలు మాత్రమే రావడంతో పీఏసీఎస్ సీఈవో రాజేశ్వర్‌రావుతో వాగ్వాదానికి దిగారు. ఏడీఏ సురేఖ భీమినికి చేరుకుని రైతులకు టోకెన్లు అందజేసి యూరియా పంపిణీ చేశారు. ఫర్టిలైజర్ దుకాణంలో యూ రియా అధిక ధరకు విక్రయిస్తున్నారని ఏడీఏ దృష్టికి తీసుకెళ్లగా.. అధిక ధరకు విక్రయించి న వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.