
ఒత్తిడి ఉండదు..
సుద్దాల జిల్లా పరి షత్ ఉన్నత పాఠశా ల బయోలజీ ఉపాధ్యాయుడు కే.రవీందర్ తన కుమారు డు రఘురామ్‌ను ప్రభుత్వ బడిలోనే చదివి స్తున్నారు. మొదట్లో పార్‌పల్లి హైస్కూల్‌లో విధులు నిర్వర్తిస్తుండగా.. సమీపంలోని ప్రైమరీ పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు. ఐదో తరగతి పూర్తి కావడం, రవీందర్‌కు సుద్దాల పాఠశాలకు బదిలీ కా వడంతో ఆరో త రగతి నుంచి అదే స్కూల్‌లో చేర్పించి చదివిస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నా డు. ‘పిల్లలపై ఒత్తిడి లేకపోవడం, పిల్లలకు అవసరమేదో బోధించేందుకు నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులు ఉండడం, విశాలమైన గదులు, అన్ని సబ్జెక్టులకు టీచర్లు, డిజిట ల్ టీచింగ్ బోర్డు, ఏఐ బోధన ఇలా కార్పొరేటుకు దీటుగా విద్యనందిస్తోందని సర్కారు బడిలోనే చేర్పించాను..’ అని రవీందర్ తెలిపారు.