
బకాయిలు చెల్లించాలి
మంచిర్యాలరూరల్(హజీపూర్): ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద ముంపునకు గురైన హాజీపూర్, లక్సెట్టిపేట మండలాల్లోని నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలని బీజేపీ నిరసన చేపట్టింది. సోమవారం హాజీ పూర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వాసిత బాధితులతో భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కా ర్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్‌పాండేకు వినతిపత్రం అందజేశారు. బీజేపీ నాయకులు గాజు ల ముఖేశ్‌గౌడ్, వెంకటేశ్వర్‌రావు, స్వామిరెడ్డి, కృష్ణమూర్తి, రాజ్‌కుమార్, హేమంత్‌రెడ్డి, రవి గౌడ్, హరిగోపాల్, వెంకటకృష్ణ పాల్గొన్నారు.
మోదీ పాలనలో పేదలకు సంక్షేమ ఫలాలు
మంచిర్యాలటౌన్: ప్రధాని మోదీ పేదలకు సంక్షేమ ఫలాలు అందించారని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హమాలీవాడ కట్ట పోచమ్మ ఆలయం, శివాజీ గ్రౌండ్‌లో మార్కింగ్ వాకింగ్ చేస్తున్న వారికి సోమవారం మోదీ పాలనను వివరించి, పోస్టర్లు విడుదల చేశారు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు.