
నాటిక ప్రతీ మొక్కను సంరక్షించాలి
భీమిని: వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ అన్నారు. కన్నెపల్లి మండలం చెర్లపల్లి ప్రాథమిక పాఠశాల, భీమిని మండలం జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం వన మహోత్సవంలో భాగంగా ఆయన స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. భీమిని మండలం జగ్గయ్యపేటలో ఎండోమెంటు కింద నిర్మించిన శివకేశవ ఆలయాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండల ప్రజల రవాణా సౌకర్యార్థం మంచిర్యాల నుంచి భీమిని మండల కేంద్రానికి ఆర్టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింగారావు, డీఆర్‌డీఏ పీడీ కిషన్, ఎంపీడీవో గంగామోహన్, ఎంఈవోలు కృష్ణమూర్తి, రాము, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాదం లక్ష్మీనారాయణ, రామాంజనేయులు, నాయకులు సంగర్స్ రవీందర్‌రావు, శ్రీహరిరావు, ఎల్పుల రోహిత్, తదితరులు పాల్గొన్నారు.