
గల్ఫ్‌లో ఆగిన మరో గుండె●
● పొన్కల్ వాసి మృతి
మామడ: కుటుంబ పోషణ, ఉపాధి నిమిత్తం గల్ఫ్ కు వెళ్లిన వ్యక్తి అక్కడ గుండెపోటుతో మృతి చెందిన విషాద సంఘటన చోటు చేసుకుంది. మండలంలో ని పొన్కల్ గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ (46) ఆరునెలల క్రితం గల్ఫ్‌కు వెళ్లాడు. కంపెనీలో ఉద్యోగం లభించిందని కుటుంబ స భ్యులకు కొన్నిరోజుల క్రితం ఫోన్‌చేసి చెప్పడంతో సంతోషపడ్డారు. సోమవారం అబుదాబిలో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో తోటి కార్మికులు ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులు తీరుతా యని అనుకుంటున్న సమయంలోనే మృత్యు వు గుండెపోటు రూపంలో కబలించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా రు. అబుదాబిలోని హెల్పింగ్ హాండ్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పిచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.