
యువతకు ఉపాధి అవకాశాలు
మంచిర్యాలఅగ్రిల్చర్: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ(డీఈఈటీ) ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి, అధికారులతో కలిసి వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ డీఈఈటీ యాప్ ద్వారా అభ్యర్థులు తమ విద్యార్హత, అనుభవం ఆధారంగా తగిన ఉద్యోగాల కోసం శోధించవచ్చని, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూలు, ఉద్యోగ మేళాలు, రెజ్యూమ్ తయారీ, కెరీర్ మార్గదర్శకత వంటి అంశాలు ఉంటాయని తెలిపారు.
విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ
భీమిని: కన్నెపల్లి మండలం జన్కాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు సంతోష్‌రావు 72సైకిళ్లు కొనిచ్చారు. సోమవారం సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్, డీఈవో యాదయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జజ్జరవెల్లి, చెర్లపల్లి, టేకులపల్లి గ్రామాల నుంచి 72 మంది బాలబాలికలు వస్తున్నరాని ఉపాధ్యాయులు తెలపడంతో సంతోష్‌రావు సైకిళ్లు అందజేశారని పేర్కొన్నారు. ఎంఈవో రాము, సెక్టోరియల్ అధికారులు సత్యనారయణ, చౌదరి, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింగారావు, సుగణకార్‌రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.