● సింగరేణి గనుల్లో స్తంభించిన బొగ్గు ఉత్పత్తి ● రూ.11కోట్లు ఉత్పత్తి, రూ.8కోట్లు వేతనాలు నష్టం | - | Sakshi
Sakshi News home page

● సింగరేణి గనుల్లో స్తంభించిన బొగ్గు ఉత్పత్తి ● రూ.11కోట్లు ఉత్పత్తి, రూ.8కోట్లు వేతనాలు నష్టం

Jul 10 2025 6:53 AM | Updated on Jul 10 2025 6:53 AM

● సిం

● సింగరేణి గనుల్లో స్తంభించిన బొగ్గు ఉత్పత్తి ● రూ.11కో

శ్రీరాంపూర్‌ బస్టాండ్‌ వద్ద రాస్తారోకో చేస్తున్న కార్మిక సంఘాల నేతలు

శ్రీరాంపూర్‌: దేశవ్యాప్తంగా బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె సింగరేణిలో విజయవంతమైంది. జిల్లాలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది. కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మికులు విధులకు హాజరు కాకుండా గనుల వద్ద నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమ్మెతో మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పరిధి బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ డివిజన్లలోని బొగ్గు గనులు పూర్తిగా స్తంభించాయి. బెల్లంపల్లి ఏరియాలోని కై రిగూడ ఓసీపీ, మందమర్రిలోని కేకే ఓసీపీ, కేకే 1, 2, 5, శాంతిఖని, శ్రీరాంపూర్‌లోని ఎస్సార్పీ ఓసీపీ, ఇందారం ఓసీపీ, ఆర్కే 5, ఆర్కే న్యూటెక్‌, ఆర్కే 7, ఎస్పార్పీ 1, ఎస్సార్పీ 3, 3ఏ, ఐకే 1ఏ భూగర్భ గనుల్లో బొగ్గు పెల్ల కూడా బయటకు రాలేదు. ఎక్కడికక్కడ కార్మిక సంఘాల నేతలు గనులపై, కూడళ్ల వద్ద లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు నిర్వహించారు. సమ్మె వల్ల బెల్లంపల్లి రీజియన్‌ పరిధిలో 29వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. దీంతో కంపెనీకి రూ.11కోట్లు నష్టం వాటిల్లింది. అత్యవసర సిబ్బంది మినహా కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నారు. జిల్లాలోని కార్మికులు రూ.8కోట్లు వేతనాలు కోల్పోయారు. అక్కడక్కడ సీహెచ్‌పీల్లోని బొగ్గు నిల్వను అధికారులు రవాణా చేయించారు. రీజియన్‌ వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు కార్మికులు, ఓబీ వర్కర్స్‌ కూడా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో సివిల్‌, ఇతర సివిక్‌, ఓబీ పనులు నిలిచిపోయాయి. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సెక్యూరిటీ విభాగం, సివిల్‌ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అన్ని జీఎం కార్యాలయాల్లో కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేసి షిఫ్ట్‌ల వారీగా కార్మికుల హాజరు శాతం, ఉత్పత్తి, సమ్మె ప్రభావంపై ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ కార్పొరేట్‌ అధికారులకు సమాచారం అందించారు.

శ్రీరాంపూర్‌లో..

సింగరేణిలో అతిపెద్ద ఏరియా శ్రీరాంపూర్‌లోని రెండు ఓసీపీలు, 6 భూగర్భ గనులు, డిపార్టుమెంట్లలో సమ్మెతో 17వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. ఓసీపీల్లో ఓబీ పనులూ నిలిపివేశారు. ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి జరుగకుండా కార్మిక సంఘాల నేతలు అడ్డుకున్నారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, టీబీజీకేఎ్‌స్‌లతో కార్మిక సంఘాల జేఏీసీ నాయకులు గనులపై సమ్మె పరిస్థితిని సమీక్షించారు. చివరికి శ్రీరాంపూర్‌ బస్టాండ్‌ వద్ద ధర్నా నిర్వహించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ కార్మికులు సమ్మెలో పాల్గొన్నందుకు ఉద్యమ వందనాలు తెలిపారు. కేంద్రం ప్రభుత్వం దిగి వచ్చి 4 లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో నిరవధిక సమ్మెకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ.సీతారామయ్య, డెప్యూటీ ప్రధాన కార్యదర్శి కే.వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచీ సెక్రెటరీ షేక్‌ బాజీసైదా, నాయకులు కిషన్‌రావు, ఎం.కొమురయ్య, అఫ్రోజ్‌ఖాన్‌, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జే.శంకర్‌రావు, గరిగే స్వామి, కలవేని శ్యాం, ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్‌రెడ్డి, టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, బ్రాంచీ ఉపాధ్యక్షుడు బండి రమేశ్‌, నాయకులు పానుగంటి సత్తయ్య, పొగాకు రమేశ్‌, గొర్ల సంతోశ్‌, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌, బ్రాంచీ అధ్యక్షులు గుల్ల బాలాజీ, ఉపాధ్యక్షుడు కే.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

సీసీసీ కార్నర్‌ వద్ద రాస్తారోకో..

హెచ్‌ఎమ్మెస్‌, ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూ, సింగరేణి ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక నాయకులు గనులపై పర్యటిస్తూ సమ్మెను విజయవంతం చేశారు. అనంతరం సీసీసీ కార్నర్‌ వద్ద రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టీ.శ్రీనివాస్‌, బ్రహ్మానందం, హెచ్‌ఎమ్మెస్‌ బ్రాంచీ ఉపాధ్యక్షుడు అనిల్‌రెడ్డి, కార్యదర్శి పీ.అశోక్‌, ఉద్యోగుల సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సమ్ము రాజయ్య, ఏఐఎఫ్‌యూ నాయకులు పోశమల్లు పాల్గొన్నారు.

● సింగరేణి గనుల్లో స్తంభించిన బొగ్గు ఉత్పత్తి ● రూ.11కో1
1/3

● సింగరేణి గనుల్లో స్తంభించిన బొగ్గు ఉత్పత్తి ● రూ.11కో

● సింగరేణి గనుల్లో స్తంభించిన బొగ్గు ఉత్పత్తి ● రూ.11కో2
2/3

● సింగరేణి గనుల్లో స్తంభించిన బొగ్గు ఉత్పత్తి ● రూ.11కో

● సింగరేణి గనుల్లో స్తంభించిన బొగ్గు ఉత్పత్తి ● రూ.11కో3
3/3

● సింగరేణి గనుల్లో స్తంభించిన బొగ్గు ఉత్పత్తి ● రూ.11కో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement