
ర్యాగింగ్ చట్టరీత్యా నేరం
లక్సెట్టిపేట: ర్యాగింగ్‌కు పాల్పడడం చట్టరీత్యా నేరమని జూనియర్ సివిల్ జడ్జి కాసమల సాయికిరణ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సు, యాంటీ ర్యాగింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలని, తొటి విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడితే కేసుల నమోదుతో మంచి భవిష్యత్ కోల్పోతారని అన్నారు. అనంతరం ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టరీత్యా విధించే శిక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్తన్న, కార్యదర్శి ప్రదీప్, న్యాయవాదులు కారుకూరి సురేందర్, పద్మ, కళాశాల ప్రిన్సిపాల్ మహాత్మా సంతోష్ విద్యార్థులు పాల్గొన్నారు.