
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
వాంకిడి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఎనోలి గ్రామానికి చెందిన సోయం మారు (35) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిస కావడంతో నిత్యం భార్యతో గొడవపడేవాడు. మంగళవారం అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చి కుమారుడు గణేశ్‌ను కొట్టాడు. దీంతో భార్య నీలాబాయి నిలదీయడంతో రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. బుధవారం గ్రామ శివారులోని ఓ చేనులో చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.