
లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలి
పాతమంచిర్యాల: కార్మిక చట్టాలు కొనసాగించాలని, లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీలు, జాతీయ కార్మిక సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఐటియూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపాల్, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, టీయూసీఐ జిల్లా కార్యదర్శి దేవరాజ్, న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి లాల్‌కుమార్ మాట్లాడుతూ కార్పొరేట్ అధిపతుల కోసమే నరేంద్రమోదీ ప్రభుత్వం కార్మిక చట్ట సవరణలు చేసి కార్మిక హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. కార్మిక చట్టాల సవరణను ఉపసంహరించుకోకపోతే ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమంలాగా కార్మికోద్యమం జరుగుతుందని తెలిపారు. సమ్మెలో పోస్టల్, బ్యాంకు ఉద్యోగులు, బీఎస్‌ఎన్‌ఎల్, తెలంగాణ మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్, తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో యూనియన్లు లేని కారణంగా బస్సులు యధావిధిగా తిరిగాయి. ప్రైవేటీకరణ విధానాలను రద్దు చేయాలంటూ జిల్లా కేంద్రంలో ఎల్‌ఐసీ సిబ్బంది నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఐసీ యూనియన్ మంచిర్యాల శాఖ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, రామదాసు, రీజినల్ కార్యదర్శి రాజేశం పాల్గొన్నారు.

లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలి