
భూములు కబ్జా కానివ్వను
● ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు
లక్సెట్టిపేట: విద్యాసంస్థలు, ఆసుపత్రుల భూములు కబ్జాకు గురవుతున్నాయని, ఇంచు జాగా వదిలిపెట్టకుండా కాపాడుతానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 13న ఆసుపత్రి భవనం ప్రారంభానికి మంత్రి దామోదర రాజనర్సింహా హాజరవుతారని తెలిపారు. పట్టణంలోని కళాశాల మైదానం కబ్జాకు గురైందని, వాటిని వెలికి తీస్తానని, అంబేద్కర్ చౌక్ నుంచి బస్టాండు వరకు రోడ్డు విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. అనంతరం పట్టణంలో నిర్మాణం చేపట్టే పలు అభివృద్ధి పనులపై వివరించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ.ఆరీఫ్, మండల అధ్యక్షుడు పింగిలి రమేష్, నాయకులు చింత అశోక్, నాగభూషణం, శ్రీనివాస్, పూర్ణచందర్, దేవేందర్ వైధ్యులు శ్రీనివాస్, సురేష్, పవిత్ర పాల్గొన్నారు.