
ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు
చెన్నూర్: రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తే అధిక లాభాలు గడించవచ్చని కమిషనర్ ఆఫ్ హార్టికల్చర్ ఉమ్మడి ఆదిలాబాద్ సూపర్‌వైజింగ్ అధికారి అజ్మీరా ప్రేమ్‌సింగ్ అన్నారు. బుధవారం ఉద్యానవన, పట్టు పరిశ్రమ ఏడీ కే.అనితతో కలిసి చెన్నూర్ వ్యవసాయ మార్కెట్ ఆయిల్‌పామ్ గెలల కొనుగోలు కేంద్రంతోపాటు చెన్నూర్ మండలం ఎల్లక్కపేట దసలి పట్టు ట్రైనింగ్ సెంటర్, భీమారం ఆయిల్ పామ్ నర్సరీలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ దిగుబడి వచ్చే వరకు అంతర పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయాలన్నారు. జిల్లాలో దసలి పట్టు కాయ దిగుబడి బాగుందన్నారు. ఈ కార్యక్రమంలో సెరికల్చర్ ఏడీ పార్వతీ రాథోడ్, మాట్రిక్ కంపెనీ అధికారి ఉదయ్‌కుమార్, శాస్త్రవేత్త కే.పి.కిరణ్‌కుమార్, టెక్నికల్ అధికారి తిరుపతి, టి.అరుణ్, కె.సహజ, కళ్యాణి, అర్చన పాల్గొన్నారు.