
గోదావరి ఇసుకకు అనుమతి ఇవ్వాలి
చెన్నూర్: చెన్నూర్ గోదావరి నది నుంచి ఇసుక తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ట్రాక్టర్ యా జమానులు అధికారులను కోరారు. ఈమేరకు ఆదివారం ట్రాక్టర్లు నిలిపి నిరసన తెలిపారు. అ నంతరం స్థానిక సీఐ దేవేందర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. బతుకమ్మ వాగు ఇసుక నాణ్య త లేక గృహ నిర్మాణదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అధికారులు ఆన్‌లైన్ పద్ధతిలో గోదావరి ఇసుక తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. నిరసనలో ట్రాక్టర్ యా జమానుల సంఘం ప్రతినిధులు అంజన్న, రాజన్న, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు ముగ్గురు ఎంపీడీవోలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): లోకసభ ఎన్నికల్లో భాగంగా జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఎంపీడీవోలు ఎట్టకేలకు సొంత జిల్లాలకు బదిలీ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయిన అబ్దుల్‌హై, కె.నాగేశ్వర్‌రెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ అయిన పి.సత్యనారాయణ తిరిగి మంచిర్యాల జిల్లాకు బదిలీ అయ్యారు.