
కరీంనగర్ జిల్లా మిల్లులకు ధాన్యం తరలింపు
మంచిర్యాలఅగ్రికల్చర్: ‘బస్తా దిగదు.. బండి కదలదు’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. గురువారం కలెక్టర్ కుమార్ దీపక్ దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ధాన్యం సే కరణ వేగవంతంతోపాటు లోడింగ్, అన్‌లోడింగ్ ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. రైస్‌మిల్లుల్లో ధాన్యం అన్‌లోడ్ కాక రోజుల తరబడి అక్కడే ఉంటున్నాయని కథనంలో ప్రస్తావించడం తెలిసిందే. అన్‌లోడ్ సమస్య పరిష్కారానికి పక్క జిల్లాలోని మిల్లులకు తరలించాలని సివిల్ సప్లయి అధికారులను ఆదేశించారు. దీంతో శుక్రవారం నుంచి కరీంనగర్ జిల్లాలోని 26 రైస్‌మిల్లులకు ట్యాగింగ్ ఇచ్చి ధాన్యం తరలిస్తున్నా రు. ఇప్పటివరకు 3,371 మంది రైతుల నుంచి 30,516.160 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. మిల్లులకు 20,407.400 మెట్రిక్ టన్నుల ధా న్యం తరలించగా.. ఇంకా 10,108.760 మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించాల్సి ఉంది.
ఎఫెక్ట్