
● ఎస్సీ వసతిగృహాల్లో నియామకం ● కాళేశ్వరం జోన్‌లో 19మంది
మంచిర్యాలఅర్బన్: ఎస్సీ వసతిగృహా సంక్షేమాధికారులుగా ఎంపికై పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచిర్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్‌రెడ్డి బుధవారం రాత్రి నియామక పత్రాలు అందజేశారు. గత ఏడాది జూన్ 24నుంచి 29వరకు కంప్యూటర్ ఆధారిత(సీఆర్‌బీటీ) విధానంలో పరీక్షలు నిర్వహించగా సెప్టెంబర్ 20న ఫలితాలు విడుదలయ్యాయి. కాళేశ్వరం జోన్ పరిధిలో 24మంది అభ్యర్థులను టీజీపీఎస్‌సీ ఎంపిక చేసిన పంపగా.. ఐదుగురు అభ్యర్థులు వివిధ కారణాలతో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు రాలేదు. దీంతో 19మందికి నియామక పత్రాలు అందజేయగా.. గురువారం కేటాయించిన వసతిగృహాల్లో రిపోర్టు చేశారు. వీరిలో 12మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. మంచిర్యాల జిల్లాకు 8, పెద్దపల్లికి 5, ఆసిఫాబాద్‌కు 4, ములుగుకు 1, జయశంకర్ భూపాలపల్లికి 1 అభ్యర్థిని ఎస్సీ వసతిగృహా సంక్షేమ అధికారులుగా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అభ్యర్థుల ఆప్షన్ల మేరకు పోస్టింగ్‌లు కేటాయించారు.
నియామకపత్రాలు అందజేస్తున్న ఎస్సీ డీడీ
రవీందర్‌రెడ్డి, ఏఎస్‌డబ్ల్యూవో రవీందర్‌గౌడ్
కాళేశ్వరం జోన్‌లో ఇలా..
మంచిర్యాల జిల్లాలో..
అభ్యర్థి పేరు కేటాయించిన పోస్టింగ్
యాసం శ్రీనివాస్ ఎస్సీ బాయ్స్‌హాస్టల్, కోటపల్లి
చీపెల్లి శ్రీనివాస్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, మందమర్రి
చండి రజనీకాంత్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, తాండూర్
చిందికింది ప్రశాంత్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, దండేపల్లి
అల్గూనూరి భార్గవ్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, చెన్నూర్
డి.శ్రీనివాస్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, చింతగూడ
టి.రాజు ఎస్సీ కాలేజ్ బాయ్స్ హాస్టల్, బెల్లంపల్లి
సద్గుణ, కూడెల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్, లక్సెట్టిపేట
ఆసిఫాబాద్ జిల్లా..
రాహుల్‌కుమార్ ఎస్సీ కాలేజీ బాయ్స్ హాస్టల్, ఆసిఫాబాద్
జలంపల్లి ప్రేమ్‌కుమార్ కాలేజీ బాయ్స్ హాస్టల్, కాగజ్‌నగర్
ఈశ్వరి ఎస్సీ కళాశాల గర్ల్స్ హాస్టల్, ఆసిఫాబాద్
రత్నం కవిత ఎస్సీ కాలేజీ గర్ల్స్ హాస్టల్ కాగజ్‌నగర్
పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో..
తోట శైలజ ఎస్సీ ఐడబ్ల్యూహెచ్‌సీ(గర్ల్స్), పెద్దపల్లి
ఇసంపల్లి రమ్య ఎస్సీ గర్ల్స్ హాస్టల్, మంథని
ప్రశాంత్ ఎస్సీ ఐడబ్ల్యూహెచ్‌సీ బాయ్స్ హాస్టల్, మంథని
డి.తిరుపతి ఎస్సీడబ్ల్యూహెచ్‌సీ బాయ్స్ హాస్టల్, మంథని
సాధుల రమేష్ ఎస్సీ కాలేజీ బాయ్స్ హాస్టల్, మంథని
ఎ.స్వాతి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ రేగోండ
డి.మమత ఎస్సీ గర్ల్స్ హాస్టల్, ఏటూరునాగారం