
అధికార లాంఛనాలతో సీఆర్పీఎస్ జవాన్ అంత్యక్రియలు
● హాజరైన సీఆర్పీఎఫ్ అధికారులు, జవాన్లు
భీమారం: గుండెపోటుతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ జవాన్ రామళ్ల సాగర్‌కు అధికార లాంఛనాలతో గురువారం భీమారంలో అంత్యక్రియలు నిర్వహించారు. భీమారం మండలకేంద్రానికి చెందిన సాగర్ సీఆర్పీఎఫ్ జవాన్‌గా శిక్షణ పొందుతున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. బుధవారం ఆయన మంచిర్యాలలో ఫంక్షన్‌కు వెళ్లగా గుండెపోటుతో మృతిచెందాడు. హకీంపేట్‌లోని సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాడెంట్ రాకేశ్ దేహార్య, జవాన్లు అంత్యక్రియలకు హాజరై తల్లిదండ్రులు గట్టయ్య, కళ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమయాత్రలో అధికారులు పాల్గొని పాడె మోశారు. శ్మశానవాటికలో మృతదేహానికి జాతీయజెండా కప్పి పూలమాలలు వేశారు. అనంతరం మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి నివాళులర్పించారు. అంత్యక్రియలకు గ్రామస్తులు తరలివెళ్లారు.

అధికార లాంఛనాలతో సీఆర్పీఎస్ జవాన్ అంత్యక్రియలు