
దగ్ధమైన జొన్నపంట పరిశీలన
బజార్‌హత్నూర్: మండలంలోని దేగామ గ్రామానికి చెందిన 11 మంది రైతులకు సంబంధించిన పదెకరాల్లో ప్రమాదవశాత్తు దగ్ధమైన జొన్న పంటను తహసీల్దార్ శ్యాంసుందర్ గురువారం పరిశీలించారు. జొన్న పంటతోపాటు రెండు టార్పాలిన్, 40 స్పింక్లర్లు, 85 పైప్‌లు, 27 స్పింక్లర్ నౌజల్స్, 1 సోలార్ ఫెన్సింగ్ పలక, బ్యాటరీ కాలిబూడిదైందని తెలిపారు. మొత్తం నష్టం విలువ రూ.8.83 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశామని, రిపోర్టు తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. తహసీల్దార్ వెంట ఎంఆర్‌ఐ నూర్‌సింగ్, బాధిత రైతులు కొడారి నరేశ్, సట్ల రమేశ్, లక్ష్మి, రాజేందర్, శ్రీకాంత్, మహేశ్, ప్రవీణ్ ఉన్నారు.