
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
మంచిర్యాలక్రైం: కమిషనరేట్ పరిధి మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. బుధవారం కమిషనరేట్ ఆవరణలోని సమావేశ మందిరంలో పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో డీసీపీలు ఎగ్గడి భాస్కర్, కరుణాకర్, అడిషనల్ డీసీపీ రాజు, ఎస్‌బీ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్లు, రవికుమార్, నర్సింహులు, మల్లారెడ్డి, ప్రతాప్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
నలుగురికి ఎస్సైగా పదోన్నతి
మంచిర్యాలక్రైం: కమిషనరేట్ పరిధిలో ఏఎస్సైలుగా పని చేస్తున్న సయ్యద్ మజారొద్దీన్, అబ్దుల్ మున్నిర్ అహ్మద్, ఎం.రాజన్న, ఆర్.బిక్‌లాల్‌కు ఎస్సైగా పదోన్నతి లభించింది. వీరికి సీపీ తన చాంబర్‌లో చిహ్నాలను అలంకరించారు.
మంచిర్యాలక్రైం: ఉద్యోగ విరమణ పొందిన సీఐ డీ.కమలాకర్, ఏఆర్‌ఎస్సై ఎం.నర్సయ్య, సీనియర్ అసిస్టెంట్ ఎస్.సుందర్‌లను సీపీ అంబర్ కిషోర్ ఝా బుధవారం ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బొర్లకుంట పోచలింగం, సిబ్బంది పాల్గొన్నారు.