జిల్లా మహిళా సమాఖ్య ఎన్నికలు
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో బుధవారం జిల్లా మహిళా సమాఖ్య ఎన్నికలు నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎస్.కిషన్, అడిషనల్ డీఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎన్నికల ప్రత్యేకాధికారి నర్సింహస్వామి, డీపీఎం స్వర్ణలత ఆధ్వర్యంలో ఏడుగురు ప్రతినిధులను, తొమ్మిది మందిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా దండేపల్లి మండలానికి చెందిన ఏ.అనిత, కార్యదర్శిగా లక్సెట్టిపేట మండలానికి చెందిన బి.శ్రీలత, కోశాధికారిగా జైపూర్ మండలానికి చెందిన ఎం.మాలతీని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికై న సభ్యులను అధికారులు శాలువాలతో సత్కరించారు.


