
‘గురుకుల’ విద్యార్థుల ప్రతిభ
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవుతా
లక్సెట్టిపేట: చిన్నప్పటి నుంచి అమ్మానాన్నల ప్రోత్సాహంతో హాస్టల్‌లో ఉంటూ చదువుకుని మంచి మార్కులు సాధించాను. కంప్యూటర్ సైన్స్ కోర్సు చదివి భవిష్యత్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలని అనుకుంటున్న. కళాశాలలో సొసైటీ షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయ్యాను. అందువల్లే మంచి మార్కులు సాఽధించాను. లెక్చరర్లు చాలా మంచిగా సిలబస్ బోధించారు. మంచి ఉద్యోగం చేసి అమ్మానాన్నలకు ఆర్థికంగా అండగా ఉంటాను.
– అస్మిత, 994 మార్కులు
లక్సెట్టిపేట: ఇంటర్మీడియెట్ ఫలి తాల్లో మండల కేంద్రంలోని ప్ర భుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ప్రైవేటు కశాళాలకు దీటుగా మార్కులు సాధించారు. కళాశాలలోని గ్రూపుల్లో ద్వితీయ సంవత్సరం 97శాతం, ప్రథమ సంవత్సరం 86శాతం ఉత్తీర్నత సాధించినట్లు ప్రిన్సిపాల్ రమాకల్యాణి తెలిపారు. అక్షయ వొకేషనల్ ద్వితీయ సంవత్సరంలో 987 మార్కులు, శ్రీవర్ష ప్రథమ సంవత్సరంలో 493 మార్కులు సాధించారు. విద్యార్థులను తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది అభినందించారు.
ఎంపీసీలో 994మార్కులు సాధించిన అస్మిత
కళాశాల విద్యార్థిని దండేపల్లి మండలం గుడిరేవు గ్రామానికి చెందిన చిట్ల రమణ, సునీత దంపతుల కూతురు అస్మిత ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 994మార్కులు సాధించింది. తండ్రి వ్యవసాయం చేస్తుండగా.. తల్లి గృహిణి. ఒకటో తరగతి నుంచి ఐ దో తరగతి వరకు గ్రామంలో చదివింది. బెల్లంపల్లి గురుకుల పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసింది.
ప్రథమ సంవత్సరంలో ప్రజ్ఞకు 468మార్కులు
నస్పూర్ పట్టణానికి చెందిన బెనికి శ్రీశైలం, శ్రీలక్ష్మి దంపతుల కూతురు ప్రజ్ఞ ఎంపీసీ ప్రథమ సంవత్సరం 468మార్కులు సాధించింది. తండ్రి ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా చేస్తుండగా..తల్లి గృహిణి.
మోడల్‌స్కూల్ విద్యార్థినికి బైపీసీలో 467మార్కులు
కాసిపేట: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థిని కొమ్మల స్వతంత్య్ర ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీలో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించింది. రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. దేవాపూర్‌కు చెందిన స్వతంత్ర తండ్రి సంతోష్ ఓరియంట్ సిమెంటు కంపెనీలో లోడింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. సివిల్స్ సాధించడం లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు స్వతంత్ర తెలిపింది.

‘గురుకుల’ విద్యార్థుల ప్రతిభ

‘గురుకుల’ విద్యార్థుల ప్రతిభ

‘గురుకుల’ విద్యార్థుల ప్రతిభ

‘గురుకుల’ విద్యార్థుల ప్రతిభ

‘గురుకుల’ విద్యార్థుల ప్రతిభ