● పరీక్షలు నిర్వహించినా, ప్రోత్సహించినా నేరమే ● కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: లింగ నిర్ధారణ నేరమని, పరీక్ష చేయడం, ప్రోత్సహించడం రెండూ నేరమే అని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మారంరెడ్డి, అదనపు కలెక్టర్ మోతిలాల్, డీఎంహెచ్‌వో హరీష్ రాజ్‌తో కలిసి లింగనిర్ధారణపై మంగళవారం సమీక్ష చేశారు. జిల్లాలో 52 స్కానింగ్ సెంటర్లు పని చేస్తున్నాయని, ఇందులో 4 ప్రభుత్వ ఆసుపత్రులలో, 48 ప్రైవేట్ వైద్యు ల ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పుట్టబో యే ది ఆడ లేక మగ అని తెలియజేయకూడదన్నారు. అలాంటివారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో తగ్గిన బాలికల నిష్పత్తిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్స చేయాలి..
జిల్లాలోని ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అంతకు మించి వైద్యం చేసినట్లుగా నిర్దారణ అయితే వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. అ నంతరం కార్యక్రమ వాల్‌పొస్టర్లను ఆవిష్కరించా రు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారి ప్రసాద్, డాక్టర్ కృపబాయి, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, ఎస్‌వో కాంతారావు, ఎన్‌జీవోలు డాక్టర్ రాధిక, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రమణ, సీఐ ప్రమోద్‌రావు, అధికారులు పాల్గొన్నారు.
అనుమతి లేని నిర్మాణలపై చర్యలు తీసుకోవాలి
అనుమతి లేని నిర్మాణలను పరిశీలించి చర్య తీసుకోవాలని, జిల్లాలో పురపాలక సంఘాల ఆదాయ వనరులను అభివృద్ధి చేయాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. పురపాలక సంఘాల కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్యం లోపించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించా రు. పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చే యాలన్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థల పన్నులతోపాటు ట్రేడ్ లైసెన్స్‌లు, ఆస్తి పన్నులను 100 శాతం వసూలు చేయాలని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎ స్ పథకంలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి రుసుం వసూలు వేగవంతం చేయాలన్నారు.