● ఆర్నెళ్లుగా పసిడి ధరలు ౖపైపెకి ● నగల తయారీపై ప్రభావం ● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
పాతమంచిర్యాల: పసిడి ధరలు రోజురోజుకూ ౖపైపెకి పోతున్నాయి. ఆర్నెళ్లుగా బంగారం ధరలు పెరుగుతుండడంతో ఆ ప్రభావం నగల తయారీపై పడుతోంది. దీంతో కులవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న స్వర్ణకారులు, బంగారు ఆభరణాల తయారీదారులు పనులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. బంగారం ధర నిలకడగా ఉండకపోవడంతో కొనుగోలు దారులు ఎక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో చిన్నచిన్న ఆభరణాలు తయారు చేసేవారికి పని లేకుండా పోతోంది. పెరుగుతున్న బంగారం ధర ఒక కారణమైతే కార్పొరేట్ సంస్థలు తయారు చేసే ఆభరణాలు కొనుగోళ్లు కాగా బెంగాల్ నుంచి వ చ్చిన కొందరు నగల తయారీదారులు తక్కువ రేట్ల కే నగలు తయారు చేయడం మరో కారణంగా స్వర్ణకారులు పేర్కొంటున్నారు. కాగా వృత్తినే నమ్ముకుని బతుకుతున్న స్వర్ణకారులకు ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ రుణాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా నిలదొక్కుకోలేక పోతున్నామని వాపోతున్నారు.
పెరుగుతున్న బంగారం ధరలు
గతేడాది నవంబర్‌లో బంగారం 10 గ్రాములకు రూ.78 నుంచి రూ.79 వేలకు మధ్యలో ఉంది. డిసెంబర్ నుంచి పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.90,900 ధర పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్‌లో కూడా నగల తయారీ కోసం అంతగా ఆర్డర్లు రాలేదని, తాళిబొట్టు, పుస్తెమెట్టెల తయారీకి కూడా ఆర్డర్లు దొరకడంలేదని వాపోతున్నారు. వాటి తయారీకి కూడా ఆర్డర్లు రావడంలేదని, అవి కొనుగోలు చేసేందుకు పెద్ద పెద్ద దుకాణాలకే వెళ్తున్నారని స్వర్ణకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను బీసీ కార్పొరేషన్‌లో కాకుండా స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి సబ్సిడీపై రుణాలు అందిస్తే కొంత చేయూత అందించినట్లవుతుందని స్వర్ణకార సంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
స్వర్ణకారుల జీవనోపాధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి సబ్సిడీపై రుణాలు అందించాలి. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి బంగారు నగల తయారీ చేస్తూ మాకు పనులు లేకుండా చేస్తున్న వారిని కట్టడి చేయాలి.
– ధర్మవరం బ్రహ్మయ్య, స్వర్ణకారుల
సంఘం జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల