● 17 మొక్కలను ధ్వంసం చేసిన పోలీసులు
నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కొర్టికల్ గ్రామ శివారులో గల వ్యవసాయ భూమిలో పడ్వాల్ దశరథ్ అనే రైతు అంతరపంటగా గంజాయి సాగు చేస్తున్నాడు. మూడేళ్లుగా భూమిని కౌలుకు తీసుకొని మిరప, వంగ, బెండ పంటల్లో అంతరంగా గంజాయి సాగు చేస్తున్నాడనే సమాచారం మేరకు పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. దశరథ్‌తో పాటు ఆయన భార్య సాగర్‌బాయిపై కేసు నమోదు చేయగా, దశరథ్ పరారీలో ఉన్నాడు. సాగర్‌బాయిని అరెస్టు చేసినట్లు ఎస్‌సై శ్రీకాంత్ తెలిపారు. పట్టుబడిన మొక్కల విలువ రూ.1లక్ష 70వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు.
రైతు అరెస్ట్
చెన్నూర్: మండలంలోని కొమ్మర శివారులోని పత్తి చేనులో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న రైతు ను అరెస్టు చేసినట్లు సీఐ దేవేందర్ తెలిపారు. మండలంలోని ఎర్రగుంటపల్లికి చెందిన రైతు జనగామ గట్టుమల్లు..కొమ్మర శివారులో రెండెకరాల భూ మిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. అక్రమ ంగా గంజాయి పెంచితే డబ్బులు వస్తాయని ఆశతో చేనులో అక్కడక్కడ గంజాయి సాగు చేస్తున్నాడు. పక్కా సమాచారంతో పోలీసులు ఆదివారం చేను కు వెళ్లి అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలి పా రు.గట్టుమల్లును రిమాండ్‌కు తరలించినట్లు పే ర్కొన్నారు. ఈమేరకు కేసునమోదు చేసినట్లు తెలి పారు. ఎస్సై సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు.