మందమర్రిరూరల్: మండలంలోని పొన్నారం గ్రామానికి చెందిన కాపురపు రవికుమార్‌కు కవితా పోటీల్లో ప్రథమ స్థానం దక్కింది. బోయి భీమన్న జీవితం–సాహిత్యంపై నిర్వహించిన కవితా పోటీలో రవికుమార్ ప్రథమ స్థానం దక్కించుకున్నారు. రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్ భీమన్న సాహితీ నిధి ట్రస్ట్, కళావేదికలో బోయి భీమన్న సతీమణి హైమావతి, కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతా ప్ తదితరుల చేతుల మీదుగా రవికుమార్ ఆదివారం బహుమతి అందుకున్నారు.