మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం దొనబండకు చెందిన గూడెల్లి శివకుమార్ గేట్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 32వ ర్యాంకు సాధించాడు. గ్రామానికి చెందిన పద్మ, శంకరయ్య దంపతుల కుమారుడు శివకుమార్‌కు ఈ నెల 16న అనూషాతో వివాహమైంది. సోదరి ప్రవళిక వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎం–ఫార్మసీ, సోదరుడు ప్రశాంత్ ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఎంటెక్ పూర్తి చేసిన శివకుమార్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
అనుదీప్‌రెడ్డికి 65వ ర్యాంకు
లోకేశ్వరం(ముధోల్): నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని హవర్గకు చెందిన అనుదీప్‌రెడ్డి బుధవారం వెలువడిన గేట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచాడు. గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి–మనోహర్‌రెడ్డి దంపతుల కుమారుడు అనుదీప్‌రెడ్డి 100 మార్కులకు గానూ 71.33 మార్కులతో జాతీయస్థాయిలో 65వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదువుతున్నాడు. తల్లి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ కాగా తండ్రి మనోహర్‌రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.
అనుమానాస్పదంగా మత్స్యకారుడు మృతి
లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలకు చెందిన మత్స్యకారుడు మేడి లింగయ్య (65) చేపల వేటకు వెళ్లి అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. లింగయ్య రోజు మాదిరిగానే బుధవారం ఉదయం చేపలు పట్టేందుకు సమీప గోదావరినదికి వెళ్లాడు. మధ్యాహ్నం అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గోదావరి వద్దకు వెళ్లిచూడగా ఒడ్డు సమీపంలో పడిపోయి ఉన్నాడు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుని భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
ముధోల్: ఈ నెల 18న ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించిన మండలంలోని ముద్గల్ గ్రామానికి చెందిన సిందె సాధన (33) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. గ్రామానికి చెందిన సిందె సాధన కొంతకాలంగా మానసిక స్థితి కోల్పోయింది. మంగళవారం ఇంట్లో ఉరేసుకోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిజామాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రి దిగంబర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి భర్త దాసు, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
గేట్ ఫలితాల్లో ప్రతిభ
గేట్ ఫలితాల్లో ప్రతిభ