● లారీ డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు
గుడిహత్నూర్: మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44పై బస్టాండ్ సమీపంలో బుధవారం మూడు లారీలు ఢీకొన్నాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ రోడ్డుపై నిలిచి ఉండగా అతివేగంగా వచ్చిన లారీ సైడ్ తీసుకుంటూ అదుపుతప్పి కంటైనర్‌ను ఢీకొట్టింది. వెనుకనుంచి వచ్చిన మరోలారీ ఆ లారీని ఢీకొట్టడంతో డ్రైవర్ ప్రసాద్, క్లీనర్ అమేద్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ పేర్కొన్నారు. కాగా ఈ నెల 8న ఇదే స్థలంలో రెండు లారీలు ఢీకొని ప్రమాదం చోటు చేసుకుంది. వరుస ప్రమాదాలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.