
● ఆక్రమణల చెరలో సాగునీటి వనరులు ● పట్టణాలు, గ్రామ శివార
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సాగు, తాగునీటి అవసరాలు తీర్చే చెరువులు కబ్జాల పాలవుతున్నాయి. ఏ టా వేసవిలో చాలా చోట్ల ఆక్రమణలకు గురవుతున్నాయి. పట్టణాలు, గ్రామ శివార్లలో ఉన్న చెరువుల విస్తీర్ణం కుచించుకుపోతోంది. ఇప్పటికే సాగునీటి శాఖ అధికారులు పలు చోట్ల ఆక్రమణలను గుర్తించారు. అయినా కబ్జాల పరంపర కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని 18 మండలాల పరిధిలో మొత్తం 890 చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో 63,493 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువుల విస్తీర్ణం తగ్గిపోవడం, కట్టలు, తూములు, కాలువలు సరిగా లేక ఆ యకట్టు పూర్తి స్థాయిలో సాగు కావడం లేదు. వానా కాలంలో సుమారు 47వేల ఎకరాల వరకే నీరందుతోంది. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో పలు చో ట్ల చెరువులు ఆక్రమణలకు గురవుతున్నట్లు అధికారుల దృష్టికి వస్తున్నాయి.
ఆక్రమణల పరంపర
ఏటేటా వాగులు, చెరువులు, నీటి పరీవాహక ప్రాంతాల విస్తీర్ణం తగ్గుతూ వస్తున్నాయి. మందమర్రి మండలం అందుగులపేట శివారు నుంచి, మంచి ర్యాల పట్టణం మీదుగా గోదావరిలో కలిసే వరకు ప్రవహించే పాలవాగు, రాళ్లవాగు కబ్జాల పాలైంది. వాగుకు ఇరువైపులా ఆక్రమణలు జరిగాయి. తి మ్మాపూర్ శివారులో వాగు హద్దుల వరకు ప్లాట్లు వే యగా, ఇటీవల కొన్నింటిని తొలగించారు. సాయికుంట, పోచమ్మకుంట, నస్పూర్, మంచిర్యాల ప ట్టణాల మధ్యనున్న తోళ్లవాగు కబ్జాకు గురికాగా, అ ధికారులు కొన్నింటిని తొలగించారు. నస్పూర్ ఊర చెరువు సైతం కబ్జాకు గురైంది. అప్పట్లో ఇక్కడ ఓ వెంచర్ వెలిసింది. తర్వాత కోర్టు తగాదాలు ఉన్నా యి. వీటిలో కొన్నింటి రిజిస్ట్రేషన్లు అయ్యాయి. బెల్లంపల్లి మండలం కన్నాల శివారు ఎర్రవాగు, భీ మారం మండల కేంద్రంలోని చెరువు కబ్జాకు గురైనట్లు గుర్తించారు. వీటితోపాటు వేమనపల్లి మండ ల కేంద్రంలోని వెంకటమ్మ చెరువు ఆక్రమణలకు గురవుతోంది. లక్సెట్టిపేట పట్టణ శివారు ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న కుట్ల చెరువు వరకు మట్టిపోస్తూ ప్లాట్లు చేస్తున్నారు.
పరిరక్షించుకుంటేనే మేలు
భూగర్భ జలాల పెంపుదల, సాగు, తాగునీటి అవసరాలు, జీవవైవిధ్యం కాపాడడంలో చెరువులు కీలకంగా ఉంటాయి. అంతేకాక మత్స్యకారులకు జీవన ఆధారమిచ్చే చెరువులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. పట్టణ ప్రాంతాలు, గ్రామాల శివార్లలో ఉన్న చోట్ల నిర్మాణాలు వెలియడంతో ఇబ్బందికరంగా మారుతోంది. కొన్ని చోట్ల తప్పుడు ధ్రువపత్రాలు తెచ్చి మరీ ఆక్రమిస్తున్నారు. కోర్టు వివాదాలతోనూ చెరువులపై కబ్జాకు గురవుతున్నాయి. సాగునీటి అధికారులు ప్రతీ చెరువును వాస్తవ విస్తీర్ణం మేరకు హద్దులు వేసి కబ్జాలు తొలగించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

● ఆక్రమణల చెరలో సాగునీటి వనరులు ● పట్టణాలు, గ్రామ శివార

● ఆక్రమణల చెరలో సాగునీటి వనరులు ● పట్టణాలు, గ్రామ శివార