వినోద్‌కుమార్‌కు యోగా రిఫరీ అవార్డు | - | Sakshi
Sakshi News home page

వినోద్‌కుమార్‌కు యోగా రిఫరీ అవార్డు

Oct 16 2025 6:14 AM | Updated on Oct 16 2025 6:14 AM

వినోద

వినోద్‌కుమార్‌కు యోగా రిఫరీ అవార్డు

జన్నారం: మండలంలోని మహ్మదాబాద్‌ గ్రామానికి చెందిన దుర్గం వినోద్‌కుమార్‌కు జాతీయస్థాయి యోగా రిఫరీ అవార్డు లభించింది. శ్రీ గణపతి సచ్చితానంద ఆశ్రమం, మై సూర్‌ వేదికగా అక్టోబర్‌ 9 నుంచి 12 వరకు, కర్ణాటక స్టేట్‌ అమెచ్యూర్‌ యోగా స్పోర్ట్స్‌ అ సోసియేషన్‌ ఆధ్వర్యంలో 50వ గోల్డెన్‌ జూబ్లీ సీనియర్‌ నేషనల్‌ యోగా స్పోర్ట్స్‌ చాంపియన్‌షిప్‌ నిర్వహించారు. తెలంగాణ నుంచి నేషనల్‌ యోగా రిఫరీగా విశేష సేవలు అందిస్తున్నందుకు వినోద్‌కుమార్‌ యోగా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జనరల్‌ సెక్రెటరీ అభినవ్‌ జోషి, వైస్‌ ప్రెసిడెంట్‌ మనోహర్‌, అగర్వాల్‌ల చేతుల మీదుగా బుధవారం మైసూర్‌లో అవార్డు అందుకున్నారు. ఆయనను ఘనంగా సత్కరించి మెమెంటో అందజేశారు.

‘ప్రజల సంరక్షణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్‌’

ఆదిలాబాద్‌రూరల్‌: ప్రజల రక్షణ కోసమే పో లీసులు కమ్యూనిటీ కాంటాక్ట్‌ (కార్డెన్‌ సెర్చ్‌) నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌. జీవన్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రణదీవేనగర్‌లో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన ధ్రువపత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, 31 ఆటోలు, రెండు ట్రాక్టర్‌లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజాయి తనిఖీ చేశామని, అనుమతులు లేకుండా విక్రయిస్తున్న 16 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐలు బి. సునీల్‌ కుమార్‌, కె. నాగరాజు, కె. ఫణిదర్‌, కర్రె స్వామి, ఎస్సైలు విష్ణువర్ధన్‌, డి. రాధిక, మహేందర్‌, రాకేశ్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.

పాఠశాలలో విచారణ పూర్తి

నర్సాపూర్‌ (జి): మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో గతంలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఉపాధ్యాయులపై బుధవారం అధికారులు విచారణ జరిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఉపాధ్యాయులు మనోహర్‌ రెడ్డి, మోహన్‌రావులను గత ఫిబ్రవరి 2న విధుల నుంచి తొలగించిన విషయం విధితమే. విచారణకు ఇటీవల డీఈవో ముగ్గురు విచారణ అధికారులను నియమించారు. నివేదికను త్వరలోనే ఉన్నతాధికారులకు ఇవ్వనున్నట్లు సమాచారం.

‘విధులకు హాజరు కావాలి’

ఉట్నూర్‌రూరల్‌: విద్యార్థుల సంక్షేమం, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కార్మికులు విధులకు హాజరు కావాలని ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో పార్ట్‌ టైం, దినసరి వేతనంతో పని చేస్తున్న 220 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్న నేపథ్యంలో వారి మూడు నెలల వేతనాన్ని ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో తాత్కాలికంగా బయట వ్యక్తులు పని చేస్తున్నారన్నారు. కొంత మంది కార్మికులు జీతాలు చెల్లించిన తర్వాత కూడా ముందస్తు అనుమతి లేకుండా, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా సమ్మెలో కొనసాగుతున్నారని పేర్కొన్నారు.

వినోద్‌కుమార్‌కు  యోగా రిఫరీ అవార్డు
1
1/1

వినోద్‌కుమార్‌కు యోగా రిఫరీ అవార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement