
దొంగతనానికి వచ్చి దొరికిపోయారు..!
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే –ఓసీలో దొంగతనానికి వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరిని సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నా రు. ఏరియా జీఎం రాధాకృష్ణ తెలిపిన వివరాలు.. మంగళవారం రాత్రి సుమారు 9.30 గంటలకు ఏరియాలోని కేకే –ఓసీ ఆవరణలోని స్టోర్ వద్దకు ముగ్గురు వ్యక్తులు వచ్చి దొంగతనానికి యత్నించారు. అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు సదానందం వారిని గమనించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎంటీఎఫ్ టీంను అలర్ట్ చేశారు. వారు అక్కడికి చేరుకుని స్టోర్ పరిసర ప్రాంతాల్లో పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా, ఒకరు పారిపోయారు. పట్టుబడిన వారిని ఏరియాలోని ఎస్‌అండ్‌పీసీ ఆఫీస్‌లోని కంట్రోల్‌రూంకు తరలించి బుధవారం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించామని జీఎం తెలిపారు. ఓసీ ఆవరణలోకి చొరబడిన వ్యక్తులను పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బందిని ఏరియా జీఎం రాధాకృష్ణ, ఎస్వో టూ జీఎం విజయప్రసాద్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ రవి తదితరులు ప్రశంసాపత్రం అందించి అభినందించారు.

దొంగతనానికి వచ్చి దొరికిపోయారు..!