
ఐటీఐ చేస్తూ.. అటే వెళ్లాడు..
నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్‌పల్లికి చెందిన ఇర్రి నర్సమ్మ, శివారెడ్డి దంపతులకు నలుగురు కుమారులు. మూడో సంతానంగా మోహన్‌రెడ్డి 1960లో జన్మించాడు. సోన్‌లోని జెడ్పీహెచ్‌ఎస్‌లో 1976లో పదో తరగతి చదివాడు. పెద్దన్నయ్య సింగరేణిలో ఉద్యోగరీత్యా గోదావరిఖనిలో పనిచేస్తుండేవాడు. ఆయన వెంట వెళ్లిన మోహన్‌రెడ్డి మంచిర్యాలలో ఐటీఐలో చేరాడు. అక్కడ చదువుతూ పీపుల్స్‌వార్ భావజాలానికి ప్రభావితుడయ్యాడు. అలా.. అక్కడి నుంచే మోహన్‌రెడ్డి దళంలోకి వెళ్లి మళ్లీ ఇంటిముఖం చూడలేదు. వరంగల్ జైలులో ఉన్నప్పుడు చాలా ఏళ్లకు కుటుంబసభ్యులు ఆయనను చూడగలిగారు. జైలు నుంచి విడుదల తర్వాత మళ్లీ దళం వైపే వెళ్లాడు. 2010లో తండ్రి శివారెడ్డి, 2021లో తల్లి నర్సమ్మ మరణించినా ఆఖరి చూపులకూ రాలేదు.
ఆచూకీ లేని తూము శ్రీనివాస్..
నిర్మల్ జిల్లా నుంచి కేంద్రకమిటీ స్థాయికి ఎదిగిన మావోయిస్టు నేతలు ఉన్నారు. సారంగపూర్ మండల కేంద్రానికి చెందిన ఒగ్గు సట్వాజీ అలియాస్ సుధాకర్/బురియార్/కిరణ్ మావోయిస్టు పార్టీ కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, సెంట్రల్ మిలటరీ సభ్యుడిగా, బిహార్–జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్‌చార్జిగా కొనసాగారు. ఆయన 2019 ఫిబ్రవరిలో తన భార్యతో కలిసి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఆ స్థాయిలో దాదాపు నాలుగు దశాబ్దాలపాటు దళంలో కొనసాగిన మోహన్‌రెడ్డి తాజాగా లొంగిపోయారు. కడెం మండలం లక్ష్మీసాగర్‌కు చెందిన కంతి లింగవ్వ అలియాస్ అనిత 2022 డిసెంబర్‌లో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందింది. మిగతావాళ్లు లొంగిపోగా, ఖానాపూర్ మండలం బాబాపూర్(ఆర్)కు చెందిన తూము శ్రీనివాస్ అలియాస్ శ్రీను ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. అటు పోలీసులు, ఇటు కుటుంబసభ్యులు ఎవరికీ తూము శ్రీనివాస్ జాడ తెలియకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా మోహన్‌రెడ్డి లొంగుబాటుతో జిల్లాలో ఒకప్పుడు వెలుగు వెలిగిన ‘దళం’ ఖాళీ అయ్యింది.
జనజీవన స్రవంతిలోకి రావాలి..
జిల్లాలో దాదాపు మా వోయిస్టు నేతలంతా జనజీవన స్రవంతిలోకి వచ్చా రు. తాజాగా మోహన్‌రెడ్డి కూడా లొంగిపోవడం శుభపరిణామం. ఇంకా ఎవరైనా మావోయిస్టులు ఉంటే వారు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని కోరుతున్నాం.
–జానకీషర్మిల, ఎస్పీ, నిర్మల్

ఐటీఐ చేస్తూ.. అటే వెళ్లాడు..