
కన్నకొడుకే కడతేర్చాడు..!
భైంసాటౌన్: తానూరు మండలంలోని ఎల్వి గ్రామానికి చెందిన పన్నేవాడ్ లక్ష్మణ్ (56) హత్య కేసు మిస్టరీ వీడింది. కన్న కొడుకే క్షణికావేశంలో తండ్రిని హత్య చేసి పంటచేనులో పాతి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. పట్టణంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ జీ. జానకీ షర్మిల బుధవారం కేసు వి వరాలు వెల్లడించారు. ఆగస్టు 31న లక్ష్మణ్ అదృశ్యం కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేపట్టారు. రెండురోజుల కిందట గ్రామ స మీపంలోని చెక్‌డ్యాం వద్ద గోనెసంచిలో లక్ష్మణ్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ మేరకు విచారణ చేపట్ట గా అతని కొడుకు(17) హత్య చేసినట్లు నిర్ధారించా రు. ఆగస్టు 31న రాత్రి తండ్రితో కలిసి కుమారుడు చేను వద్దకు వెళ్లగా, చేను చుట్టూ చూసి రమ్మని తండ్రి చెప్పాడు. దీంతో తాను వెళ్లనని మొండికేయడంతో తండ్రి మందలించాడు. క్షణికావేశానికి గురైన కొడుకు అక్కడే ఉన్న గొడ్డలితో కొట్టి చంపి అక్కడే చేనులో తండ్రి మృతదేహాన్ని పాతిపెట్టాడు.
పెంపుడు కుక్కే పట్టించింది..
వారం రోజులకు తల్లితో కలిసి తన తండ్రి కనిపించడం లేదని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండురోజుల కిందట మృతుడి పెంపుడు కుక్క చేనులో తిరుగుతూ మృతదేహం పాతిపెట్టిన స్థలంలో గోనెసంచిని వెలికితీసింది. దీంతో మృతుడి పుర్రెభాగం బయటికి రాగా గమనించిన గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారమిచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ మేరకు ఘటనాస్థలంలో లభించిన ఆధారాలతో కొడుకే హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఏఎస్పీ అవినాశ్‌కుమార్ ఆధ్వర్యలో కేసు చేధనలో కీలకంగా పనిచేసిన ముధోల్ సీఐ మల్లేశ్, ఎస్సై పెర్సిస్, తానూర్ ఎస్సై జుబేర్‌లను ఎస్పీ అభినందించారు.