కార్మికుల ఖాతాల్లోకి ‘ఏరియర్స్‌’ | - | Sakshi
Sakshi News home page

కార్మికుల ఖాతాల్లోకి ‘ఏరియర్స్‌’

Sep 22 2023 1:30 AM | Updated on Sep 22 2023 1:30 AM

- - Sakshi

అనుకున్నంత రాలేదు

11వ వేతన ఒప్పందంలో కార్మికులు ఆశించిన స్థాయిలో వేతనాల్లో పెరుగుదల లేకపోవడంతో ఏరియర్స్‌ డబ్బులు అనుకున్న స్థాయిలో రాలేదు. జాతీయ కార్మిక సంఘాలు మెరుగైన వేతన ఒప్పందం చేసుకుని ఉంటే కార్మికులు మరింత లాభం చేకూరేది. కొన్ని కార్మిక సంఘాలు సింగరేణి ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ దుష్ప్రచారం చేశాయి.

– మల్రాజు శ్రీనివాస్‌రావు టీబీజీకేఎస్‌

బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు

మెరుగైన వేతన ఒప్పందం

గతంలో ఎన్నడూ లేని వి ధంగా 11వ వేజ్‌బోర్డులో కార్మికులకు వేతనాలు పెరి గాయి. కాస్త ఆలస్యమైనప్పటికీ గతంలో కంటే మె రుగైన వేతన ఒప్పందాన్ని జాతీయ కార్మిక సంఘాలు సాధించాయి. భవిష్యత్‌లోనూ కా ర్మికులకు మరిన్ని హక్కులు సాధించేందుకు జాతీయ కార్మిక సంఘాలు యాజమాన్యాలతో పోరాడుతూనే ఉంటాయి.– ఎస్‌.తిరుపతి,

ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి

రెబ్బెన/నస్పూర్‌: సింగరేణి కార్మికులకు 11వ వేజ్‌బోర్డుకు సంబంధించిన 23 నెలల ఏరియర్స్‌ డబ్బులను గురువారం ఒకే దఫాలో చెల్లించింది. సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశాల మేరకు డైరెక్టర్‌ (ఫైనాన్స్‌, పర్సనల్‌) ఎన్‌.బలరాం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ నుండి ఆన్‌లైన్‌లో 39 వేల మంది కార్మికులకు వేతన బకాయిలు చెల్లించారు.

ఒక్కో కార్మికుడికి సగటున రూ.3.75 లక్షలు

11వ వేతన ఒప్పందం చర్చలు 2021 జూలైలో జరగాల్సి ఉండగా జాతీయ కార్మిక సంఘాల డిమాండ్లకు బొగ్గు సంస్థలు అంగీకరించకపోవటంతో పలుదఫాలు వాయిదా పడ్డాయి. ఎట్టకేలకూ బొగ్గు సంస్థలు అంగీకారం తెలపడంతో 23 నెలల అనంతరం 2021 నుండి జూలై నుంచి పెరిగిన వేతనాలకు సంబంధించిన ఏరియర్స్‌ను సింగరేణి యాజమాన్యం విడుదల చేసింది. ఒక్కో ఉద్యోగికి సగటున సుమారు రూ.3.75 లక్షలు పొందగలిగారు. కాగా ఆర్జీ–1 ఏరియాకు చెందిన వేముల సుదర్శన్‌రెడ్డి రూ.9.91 లక్షలతో సింగరేణి టాపర్‌, ఆర్జీ–2 ఏరియాకు చెందిన మీర్జా ఉస్మాన్‌బేగ్‌ రూ.9.35 లక్షలతో ద్వితీయస్థానంలో, శ్రీరాంపూర్‌ ఏరియాకు చెందిన హెడ్‌ఓవర్‌మెన్‌ ఆడెపు రాజమల్లు రూ.9.16 లక్షలతో తృతీయస్థానంలో నిలిచారు. బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రిలో డైటీషియన్‌గా పనిచేస్తున్న ఎస్‌.విజయలక్ష్మి రూ.5.40 లక్షలు పొంది ఏరియాలో అత్యధిక ఏరియర్స్‌ పొందిన ఉద్యోగిగా నిలిచారు. అత్యధిక ఏరియర్స్‌ పొందిన ఉద్యోగులను ఏరియా జీఎం రవిప్రసాద్‌ శాలువాలతో సత్కరించి చెక్కులు అందజేశారు. ఒకే దఫాలో బ్యాంకు ఖాతాలో డబ్బులు జమకావడంతో కార్మికులు హర్షంవ్యక్తం చేస్తున్నారు.

రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఐటీ

సంవత్సర ఆదాయం రూ.10 లక్షలలోపు ఉన్న వారికి 20శాతం, ఆపై వారికి 30 శాతం ఐటీ చెల్లిస్తున్నారు. అయితే ప్రస్తుతం చెల్లించిన ఏరియర్స్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో కార్మికులు పొందిన ఆదాయంగా యాజమాన్యం పరిగణలోకి తీసుకుంటుడటంతో ఒక్కో కార్మికుడు రూ.50వేల నుండి రూ. లక్ష వరకు ఐటీ చెల్లించాల్సి వస్తోంది. ఏరియర్స్‌లోంచి 12 శాతం పీఎఫ్‌, 7 శాతం పెన్షన్‌ కోసం కోత విధించగా మిగిలిన మొత్తాన్ని కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.

23 నెలల వేతన బకాయిలు విడుదల చేసిన సింగరేణి

ఒక్కో కార్మికుడికి సగటున రూ.3.75 లక్షలు

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement