న్యూస్‌రీల్
స్నేహితుడి బర్త్‌డే రోజే..
స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో సంతోషంగా పాల్గొన్న ఇద్దరు మిత్రులు ఆ తర్వాత బైక్‌పై వెళ్తుండగా డీసీఎం ఢీకొని మృతిచెందారు.
బుధవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2026
–8లో u
నియంత్రణ చట్టం తేవాలి..
ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. దీనివల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన వి ద్య అందుతుంది. యాజమాన్యాలు వి ద్యార్థుల నుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా రు. అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవే టు పాఠశాలల్లో పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టాలి.
– సీతారాముడు,
పీడీఎస్‌యూ, జిల్లా ప్రధాన కార్యదర్శి
నిబంధనలకు విరుద్ధం..
ప్రభుత్వ అనుమతి లేకుండా మహబూబ్‌నగర్‌లోని నారాయ ణ పాఠశాలలో పుస్తకాలు విక్రయిస్తుంటే వాటిని పట్టుకున్నా ం. ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనిపై డీఈఓకు ఫిర్యాదు చేశాం. ఎంఈఓకు ఫోన్ ద్వా రా సమాచారం ఇస్తే నాకు మీటింగ్ ఉందని చెప్పి రాలే దు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేస్తే ఎత్తలేదు. అధికారులు తక్షణమే స్పందించి పాఠశాలలను తనిఖీ చేయాలి.
– శివసాగర్, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు
చర్యలు తీసుకుంటాం..
ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రు లు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. పాఠశాలల్లో ఎలాంటి స్టేషనరీ, యూనిఫాంలు అమ్మకూడదు. వీటితో పాటు పుస్తకాలను కేవలం ఎమ్మార్పీకే అమ్మాలి. అలాగే పాఠశాల సమయంలో సిలబస్ మాత్రమే బోధించాలి. ఐఐటీ, నీట్ వంటివి చెప్పడానికి వీల్లేదు.
– విజయకుమారి, డీఈఓ, మహబూబ్‌నగర్
ప్రభుత్వ పుస్తకాలకు మంగళం..
ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన పుస్తకాలను అమ్మడం వల్ల దానిపై ఉన్న నిర్దిష్ట ధరకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. వీటిని కొనుగోలు చేస్తే కేవలం రూ.600 లోపు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ, ఇక్కడ 70 శాతం పాఠశాలలు ఐదో తరగతి వరకు ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలను విద్యార్థులకు అందించడం లేదు. వివిధ ప్రైవే టు పబ్లికేషన్లు ప్రచురించిన పుస్తకాలనే తీసుకోవాలని సూచిస్తూ.. వాటికి ఎడాపెడా ధరలు నిర్ణయించి బహిరంగంగా విక్రయించడం గమనార్హం. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలకు అసలు పాఠ్యపుస్తకాలు, సిలబస్‌ను ప్రభుత్వం నిర్ణయించలేదు. అయినప్పటికీ ప్రైవేటు సంస్థలు సిలబస్ రూపొందించి ప్రత్యేకంగా పుస్తకాలను విక్రయించడం కొసమెరుపు. వీటిని కొన్ని పాఠశాలలు అక్కడే డంప్ చేసి అమ్ముతుండగా.. మరికొన్ని పాఠశాలలు సమీపంలోని బుక్ సెంటర్ల ద్వారా విక్రయిస్తున్నా రు. అధిక ఫీజులు ఒక ఎత్తయితే.. యూని ఫాంలు, టై, బెల్టులు కొనడం మరో ఎత్తుగా మారింది. ఒక్కో విద్యార్థికి కనీసం రెండు యూనిఫాంల చొప్పున రూ.2,500ల నుంచి రూ.3 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. టై, బెల్టులు, ఇతర నోట్ పుస్తకాలు కూడా చాలా పాఠశాలల్లోనే విక్రయించడం కొసమెరుపు.


