కలుపు నివారణతో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

కలుపు నివారణతో అధిక దిగుబడులు

May 31 2026 12:48 AM | Updated on May 31 2026 12:48 AM

అలంపూర్‌: వానాకాలం సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ఈ సీజన్‌లో వివిధ రకాల పంటలతో పాటు కూరగాయలు, పప్పుదినుసులు సాగు చేయనున్నారు. అయితే పంటలో కలుపు నివారణతోనే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందని ఏడీఏ సక్రియా నాయక్‌ సూచించారు. కలుపు నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

కూరగాయల సాగు: వంగ, టమాటా, ఉల్లి, వెల్లుల్లి సాగుకు ముందు ఎకరాకు 1–1.3 లీటర్ల పెండామిథాలిన్‌ లేదా 200 మి.లీ. ఆక్సిఫ్లోరాఫెన్‌ పిచికారీ చేయాలి. ఉల్లి, వెల్లుల్లి నాటిన 15–20 రోజులకు నేలలో తేమ చూసుకొని 200 మి.లీ. ఆక్సిఫ్లోరాఫెన్‌ కూడా వాడవచ్చు. బెండలో విత్తిన వెంటనే లేదా 12 రోజుల్లో ఎకరాకు 1–1.3 లీటర్ల పెండిమిథాలిన్‌ లేదా 1.5–2 లీటర్ల అలాక్లోర్‌ చల్లాలి. క్యాబేజి, కాలిఫ్లవర్‌ నాటడానికి 1 లేదా 3 రోజుల ముందు ఎకరాకు 200 మి.లీ. ఆక్సిఫ్లోరాఫెన్‌ పిచికారీ చేయాలి. కంద, చేమ పెండలం వేస్తే కలుపు ఎక్కువగా వచ్చే భూముల్లో మొదటి దఫా తడిచ్చాక ఎకరాకు 1.3 లీటర్ల పెండిమిథాలిన్‌ లేదా ఆక్సిఫ్లోరోఫెన్‌ పిచికారీ చేయాలి.

కంది: కంది విత్తిన వెంటనే 1 లేక 2 రోజుల్లో ఎకరాకు 1.1.3 లీటర్ల పెండిమిథాలిన్‌ వాడాలి. విత్తిన 30 లేక 60 రోజుల్లో గొర్రు గుంటకతో అంతర్‌ కృషి చేయాలి. లేదా ఇమజితాపీర్‌ ఎకరాకు 200 మి.లీ. పిచికారీ చేయాలి.

మినుము/పెసర: విత్తిన 1 లేక 2 రోజుల్లో ఎకరాకు 1–1.3 లీటర్ల పెండిమిథాలిన్‌, విత్తిన 20 రోజులకు గడ్డి జాతి కలుపు నివారణకు 250 మి.లీ. పెనాక్స్‌ ప్రాప్‌ ఇథైల్‌ 5 శాతం మందును 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి. పొలంలో గడ్డిజాతి వెడల్పుకు కంటే ముందు ఎకరాకు 200 మి.లీ. ఇమిజితాపిర్‌ 10 శాతం పొడి పిచికారీ చేయాలి. ఈ మందు చల్లితే మినుము పెరుగుదల వారంపాటు ఆగినప్పటికీ తిరిగి మామూలు స్థితికి వస్తోంది.

శనగ: పైర్లు విత్తిన వెంటనే లేదా ఒకటి, రెండు రోజుల్లో ఎకరాకు 1–1.3 లీటర్ల పెండిమిథాలిన్‌ పిచికారీ చేయాలి. సోయా చిక్కుడులో విత్తిన 20 రోజుల సమయంలో 250 మి.లీ. ఇమజితాపిర్‌ మందు కూడా పిచికారీ చేయవచ్చు.

వేరుశనగ: విత్తిన వెంటనే లేదా ఒకటి, రెండు రోజుల్లో ఎకరాకు 1–1.6 లీటర్ల పెండిమిథాలిన్‌ లేదా 1.5–2 లీటర్ల బుటాక్లోర్‌ 50శాతం విత్తిన 20 లేక 25 రోజుల సమయంలో గడ్డిజాతి కలుపు నిర్మూలన కోసం పైనక్సాప్రాప్‌ ఇథైల్‌ పిచికారీ చేయాలి.

పాడి–పంట

కూరగాయల సాగులో

సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

Advertisement
 
Advertisement
Advertisement