గ్రేడింగ్ విధానం
కాయలను గ్రేడింగ్ చేయడం ద్వారా అవసరమైన సైజు(పరిమాణం), రంగు, బరువును బట్టి చేయడం వల్ల మంచి ధర లభించే అవకాశం ఉంటుంది. ఆవిరి (వేపర్ ట్రీట్‌మెంట్) ద్వారా కాయలను శుభ్రం చేసుకోవచ్చు. గ్రేడింగ్ చేయడంతో రైతుకు వినియోగం కూడా లాభం చేకూరుతుంది. బరువును బట్టి గ్రేడింగ్ చేయవచ్చు. 200–250 గ్రాములు ఉన్నవాటిని మరో గ్రేడ్‌గా, 300 నుంచి 350 బరువు ఉన్నవాటిని ఇంకో గ్రేడ్‌గా తయారు చేస్తే మంచిధర లభిస్తోంది.
అలంపూర్: మామిడిలో పోషకాలు అత్యంత విలువైనవి. అందుకే మాడిని పండ్లలో రాజుగా గుర్తిస్తారు. ఇందులో విటమిన్–సీ 76 శాతం, విటమిన్–ఏ 25 శాతం, విటమిన్–బీ 6నుంచి 11శాతం, ఫైబర్(పిచు) 9 శాతం, రాగి 9 శాతం పొటాషియం 7శాతం, మెగ్నీషియం 4శాతం ఉంటుంది. మామిడి ఆరోగ్యం కాబట్టి వాటిని మాగించే పద్ధతులు, కోత కోసే సమయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియా నాయక్ రైతులకు సూచించారు.
మామిడి మాగించడం:
మార్కెట్‌లోకి పంచదార, కలప వంటి రకాలు ముందుగా వస్తాయి. పెద్దరసం, చిన్నరసం, చెరుకు రసాలు తర్వాత అందుబాటులోకి వస్తాయి. బేనిషా రకం ఆ తర్వాత నీలం, బెంగుళూరు(తోతపరి, కలెక్టర్) రకాలు అలస్యంగా మార్కెట్‌లోకి వస్తాయి. ముందుగా వచ్చే పండ్లకు నాణ్యత ఉండదు. కార్బెట్‌ను ఉపయోగించి రంగును తెప్పించి విక్రయిస్తారు. తర్వాత వచ్చే మామిడి పండ్లు రుచికరంగా ఉంటాయి. ఒకగదిలో గడ్డి లేదా వరిగడ్డి పరచి వాటిపై కాయలు పేర్చి మళ్లీ గడ్డిని కప్పాలి. రెండుమూడు రోజుల్లోనే కాయలు మాగుతాయి. పండ్లు మంచి నాణ్యత కలిగి ఉంటాయి. అవసరమైతే మామిడికి మంచి రంగును తెప్పించడానికి ఇథైల్‌ను ఉపయోగించవచ్చు. ఇది కెమికల్ కాదు. ఇది హార్మోన్. లీటర్ నీటికి 1ఎంఎల్ నుంచి 1.8 ఎంఎల్‌ను ఉపయోగించి కాయలన్నింటికీ సమానంగా రంగును తెప్పించి మాగపెట్టవచ్చు. ఇథైల్‌ను వేడి నీటిలో 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కలిపి కాయలను 5నిమిషాలు ముంచి తీసి ఆరబెట్టాలి. మామిడి పండ్లను చెక్కపెట్టల్లో కాకుండా సీఎఫ్‌బీ పెట్టెల్లో ఉంచి రవాణా చేయవచ్చు. 5–10 కిలోల వరకు పెట్టేల్లో ఉంచి దూరప్రాంతాలకు రవాణా చేయడం వల్ల దెబ్బతినవు.
కాల్షియం కార్బైట్ ద్వారా మాగించడంతో..
కొంతమంది రైతులు, వ్యాపారులు కాయలను మాగపెట్టడానికి ప్రమాదకరమైన పద్ధతులు పాటిస్తున్నారు. కాల్షియం కార్బైట్‌ను అధికంగా వినియోగించి సరిగ్గా పక్వానికి రాని కాయలను కృత్రిమంగా రంగు తెప్పించి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వీటికి మంచి రంగు ఉంటుంది. కానీ రుచి ఉండదు. పుల్లగా ఉంటాయి. ఇలా మాగబెట్టినవి తినడంతో ఆరోగ్యానికి హానికి కలిస్తాయి. బాగా ముదిరిన కాయలను మాగబెట్టడానికి ఎలాంటి రసాయనాలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.
ఇథైల్ వాడకం శ్రేయస్కరం
మామిడి కాయలను మాగించడానికి ఇథైల్ వాడకం శ్రేయస్కరం. దీన్ని ఉపయోగించడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఇది ఆకు పచ్చని రంగును ఆకర్షణీయమైన రసం పసుపు రంగుకు మారుస్తుంది. పండ్లు తీపిదనాన్ని, మంచి సువాసనను ఇస్తోంది. ఇథైల్ వాడకంతో మామిడి కాయాల్లో ఇథిలిన్ వాయువు ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అందువల్ల రైతులు కార్బెడ్ ఉపయోగించకుండా ఈ సూచన ప్రకారం మాగపేడితే మంచి నాణ్యత వస్తోంది. రైతుకు మంచి ధర లభిస్తోంది.
మామిడి కోతలో జాగ్రత్తలు తప్పనిసరి
పాడి–పంట


