కొత్తపల్లి: నాలగు రోజులుగా కొనసాగుతున్న లోకామసంద్ బావాజీ ఉత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. శనివారం చివరి రోజు ఉదయం అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు. కాళికాదేవికి భక్తులు మొక్కుబడిగా మేకపోతులు, గొర్రె పోతులను బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ పూజారులు చందర్‌నాయక్, భీమ్లాయాక్, దేవ్లానాయక్, దన్‌సింగ్‌లు కాళికామాతకు మహా హోమం జరిపంచారు. రాష్ట్రంలోనే అతి పెద్ద గిరిజన సామాజిక వర్గాల జాతర కావడంతో గిరిజనులు పెద్దఎత్తున హాజరయ్యారు. 3 నుంచి 4 లక్షల మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొనట్లు ఈఓ కోమల్ తెలిపారు.
ప్రభుసేవలో కర్ణాటక మాజీ మంత్రి
గురులోకా మసంద్ బావాజీ, కాళికామాతను శనివారం కర్ణాటక మాజీ మంత్రి ప్రభుచౌహాన్ దర్శించుకున్నారు. ఎమ్మెల్యేగా వరుసగా ఐదోసారి గెలుపులో లోకామసంద్ బావాజీ ఆశీస్సులతోనే ప్రజల్లో ఉంటున్నానని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆలయన అభివృద్ధిపై దృష్టి సారిస్తే గొప్ప పర్యాటక ప్రదేశంగా మారి మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన ఆకాక్షించారు.
కలెక్టర్ ప్రత్యేక పూజలు
బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా కలెక్టర్ ప్రతీక్‌జైన్ స్వామివారిని దర్శించుకొన్నారు. ఆర్డీఓ రాంచందర్‌నాయక్, ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికారు. జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, డీపీఓ సుధాకర్‌రెడ్డి, డీపీఆర్వో రశీద్, తహసీల్దార్ జయరాములు, కొత్తపల్లి మద్దూరు ఎంపీడీఓలు కృష్ణారావు, రామన్న, కోస్గి సీఐ సైదులు, ఎస్‌ఐ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


